గువాహటి: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించి మరో స్టేడియం అరంగేట్రం షురూ అయ్యింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలోనే బరస్పరా స్టేడియంలో ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌ను నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బరస్పరా స్టేడియంలో రెండు మ్యాచ్‌లో జరగనున్నాయి. రాజస్తాన్ రాయల్స్ రెండో హోమ్ గ్రౌండ్‌గా బరస్పరా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 5వ తేదీ, 8వ తేదీల్లో బరస్పరాలు మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపింది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి గం.8..00ని.లకు జరపనున్నట్లు తెలిపింది. (ఇక్కడ చదవండి: సన్‌రైజర్స్ కెప్టెన్‌గా మరోసారి వార్నర్)
‘గువాహటి’కి గ్రీన్ సిగ్నల్